హార్దిక్‌ పాండ్య తండ్రి కాబోతున్నాడు కాబట్టి.. 

ఈసారి సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహించే ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య...

Published : 27 Jul 2020 01:42 IST

అది అతడికి అదనపు శక్తినిస్తుంది : బ్రాడ్‌హాగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈసారి సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహించే ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా’ నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ లెగ్‌స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ అన్నాడు. చాలా రోజుల నుంచి పాండ్య క్రికెట్‌కు దూరమయ్యాడని, అలాగే త్వరలో తండ్రి కాబోతున్నాడని చెప్పాడు. ఆ రెండు కారణాలతో ముంబయి ఆల్‌రౌండర్‌కు అదనపు శక్తి పొందుతాడని, తద్వారా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపిక అవుతాడని హాగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ జట్టే ఈసారి కూడా విజేతగా నిలుస్తుందని చెప్పాడు. 

ముంబయి జట్టు తొలి నలుగురు మంచి ఆటగాళ్లు అని, తర్వాత వచ్చే ఆటగాళ్లు కూడా అత్యుత్తమ ఆల్‌రౌండర్లని చెప్పాడు. అలాగే వారికి అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉందన్నాడు. ఇక డెత్‌ ఓవర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగా లాంటి మేటి పేసర్లున్నారని గుర్తుచేశాడు. ముంబయి ఇండియన్స్‌ తర్వాత తన రెండో ఫేవరెట్‌ ఆర్సీబీ జట్టని, 12 సీజన్లలో అది ఇప్పటివరకూ టైటిల్‌ సాధించేదని పేర్కొన్నాడు. ఆ జట్టుకు మంచి ఆటగాళ్లున్నా ఎప్పుడూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని వివరించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఆ జట్టు టాప్‌ఆర్డర్‌లో చేరాడని, అతడు చాలా త్వరగా పరుగులు చేస్తాడన్నాడు. దాంతో తర్వాత  బ్యాటింగ్‌ చేసే విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ లాంటి ఆటగాళ్లపై భారం తగ్గుతుందని వ్యాఖ్యానించాడు.  అనంతరం ధోనీ గురించి మాట్లాడిన బ్రాడ్‌.. అతడో అద్భుతమైన ఆటగాడని, భయం లేకుండా ఆడతాడని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అతడిని ఎవరూ రీప్లేస్‌ చేయలేరని వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని