కష్టాలు ఎదురైనా చెడుపై మంచే విజయం

నేడు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు తమ అభిమానులకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పటికైనా చెడుపై మంచే విజయం...

Updated : 25 Oct 2020 12:38 IST

దసరా పండుగ సందర్భంగా క్రికెటర్ల శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: నేడు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు తమ అభిమానులకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనడానికి ఈ పండుగే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 

* మన ప్రయాణం ఎంత దూరంగా ఉన్నా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చివరికి చెడుపై మంచే విజయం సాధిస్తుంది. మనతో పాటు మన చుట్టూ ఉండే ప్రతికూల ప్రభావాలపై విజయం సాధించాలని కోరుతున్నా.  - సచిన్‌ తెందూల్కర్‌

* ఈ దసరా పండుగ సందర్భంగా మీకూ, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. - విరాట్‌ కోహ్లీ

* ఈ విజయదశమి సందర్భంగా శ్రీరాముడు తన ఇష్టప్రకారం అందరి కోరికలు తీర్చాలి. ప్రేమ, కరుణ, నీతి నిజాయతీ గల ఆ రాముడికి జై. హ్యాపీ దసరా.  - వీరేంద్ర సెహ్వాగ్‌

* ప్రతీ ఒక్కరికీ విజయ దశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలిచిన ఈ రోజు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిమంత్రంగా నిలవాలి. అలాగే ఈ పండుగ మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుతున్నా.  - గౌతమ్‌ గంభీర్‌

* అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ చెడుపై మంచి విజయం సాధించాలి. ఇది మన చుట్టే కాదు. మనలోనూ జరగాలి. ఈ శుభ సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు కలగాలి. -సురేశ్‌ రైనా

* ఈ దసరా పండుగ మనందరి జీవితాల్లో అమితమైన ప్రేమతో పాటు మంచిని కూడా తీసుకురావాలి. -వీవీఎస్‌ లక్ష్మణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని