బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అబుదాబి వేదికగా బెంగళూరు×హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయిర్-2కు చేరుతుంది

Updated : 06 Nov 2020 19:06 IST

ఇంటర్నెట్‌డెస్క్: టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అబుదాబి వేదికగా బెంగళూరు×హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయిర్-2కు చేరుతుంది. ఓటమిపాలైన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాగా, ఈ సీజన్‌లో లీగ్‌ దశలో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా చెరో విజయం సాధించాయి.

జట్ల వివరాలు

హైదరాబాద్: వార్నర్‌ (కెప్టెన్), గోస్వామి, మనీష్‌ పాండే, విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్, ప్రియమ్‌ గార్గ్‌, హోల్డర్‌, రషీద్ ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, సందీప్ శర్మ, నటరాజన్‌

బెంగళూరు: ఫించ్‌, పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, జంపా, వాషింగ్టన్‌ సుందర్, సైని, మహ్మద్ సిరాజ్‌, చాహల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని