ఐపీఎల్‌ షెడ్యూల్‌పై ఆరోజే నిర్ణయం

సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహించే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌కు సంబంధించి ఆగస్టు 2న పాలకమండలి సమావేశం కానుంది. ఆ రోజు మెగా టోర్నీకి సంబంధించిన...

Updated : 28 Jul 2020 14:47 IST

త్వరలో సమావేశం కానున్న గవర్నింగ్‌ కౌన్సిల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహించే ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించి ఆగస్టు 2న పాలకమండలి సమావేశం కానుంది. ఆ రోజు మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఎనిమిది జట్లు 50 రోజుల పాటు 60 మ్యాచ్‌లు ఆడే విధంగా దానిని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. టోర్నీని ఎలా నిర్వహించాలి. ఆటగాళ్ల సాధన, వసతి సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై లోతుగా చర్చించనున్నారు. 

మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో అక్కడికి చేరుకునే వారు క్వారెంటైన్‌లో ఉండడానికి తగిన ఏర్పాట్లపైనా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, నేటితో వీరిద్దరి పదవీ కాలం పూర్తయింది. లోధా కమిటి నిబంధనల ప్రాకారం గంగూలీ, షా తొమ్మిది నెలల పాటే ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై బీసీసీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ కమిటీ నిబంధనలు బోర్డు పాలనకు ఇబ్బందిగా ఉందని పేర్కొంది. దీంతో ఇప్పుడు వారిద్దరూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని