టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్

Updated : 02 Dec 2020 08:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో తీవ్రత చూపించలేకపోయామని, నేటి పోరులో సత్తాచాటుతామని టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ప్రయత్నిస్తోంది. కాగా, భారత్ తుదిజట్టులో భారీమార్పులు జరిగాయి. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ స్థానంలో శుభ్‌మన్‌ గిల్ వచ్చాడు. సైని, షమి, చాహల్‌ స్థానాల్లో నటరాజన్, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎడమచేతి వాటం పేసర్‌ అయిన నటరాజన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు.

జట్ల వివరాలు:

భారత్‌: శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, టీ నటరాజన్‌

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్, మాక్స్‌వెల్, స్టాయినిస్‌, హెన్రిక్స్‌, అలెక్స్ కేరీ, కామెరన్‌ గ్రీన్‌, ఆస్టన్‌ అగర్, హేజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌, జంపా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని