సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన రాహుల్‌

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ పేరుమీద ఉన్న ఈ రికార్డును..

Published : 25 Sep 2020 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గురువారం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన కేఎల్‌ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన భారతీయుడిగా నిలిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ పేరుమీద ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్‌ ఈ ఘనతను 63 ఇన్నింగ్స్‌లో సాధించగా కేఎల్‌ 60 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఇదివరకు 1998 పరుగులతో ఉన్న రాహుల్‌ బెంగళూరుతో ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం 48 ఇన్సింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన విండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్ ఓవరాల్‌గా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

గురువారం కోహ్లీ సేనతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించి ఆడిన రాహుల్ కేవలం 69 బంతుల్లో 132 పరుగులు సాధించాడు. అందులో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం. లీగు చరిత్రలోనే ఓ భారతీయుడు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన కెప్టెన్‌గానూ రాహుల్‌ ఘనతను సొంతం చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని