ఆసీస్‌కు కోలుకోలేని దెబ్బ

ఆస్ట్రేలియా జట్టుకు మరో దెబ్బ. గాయాల కారణంగా ఇప్పటికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌తోపాటు స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ జట్టుకు దూరమవ్వగా తాజాగా జట్టు ప్రధాన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు....

Published : 06 Dec 2020 11:49 IST

టీ20 సిరీస్‌కు మిచెల్‌ స్టార్క్‌ దూరం

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా జట్టుకు మరో దెబ్బ. గాయాల కారణంగా ఇప్పటికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌తోపాటు స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ జట్టుకు దూరమవ్వగా తాజాగా జట్టు ప్రధాన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవ్వడంతో వారి వెంట ఉండేందుకు స్టార్క్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అంగీకారం కూడా తెలిపారు. దీంతో భారత్‌తో జరిగే మిగతా రెండు టీ20 మ్యాచులకు స్టార్క్‌ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని కోచ్‌ లాంగర్‌ వెల్లడించారు. ‘స్టార్క్‌ కుటుంబానికి అతడి అవసరం ఉంది. అందుకే అతడు వెళ్లేందుకు అనుమతిచ్చాం. స్టార్క్‌ కావాల్సినంత సమయం తీసుకోవచ్చు. అతడు ఎప్పుడు తిరిగి వస్తే అప్పుడు జట్టులోకి ఆహ్వానిస్తాం’ అని లాంగర్‌ పేర్కొన్నారు.

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-2 తేడాతో పరాజయం చవిచూసింది. అనంతరం జరిగిన టీ20 సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో స్పిన్నర్‌ చాహల్‌‌, యువ పేసర్‌ నటరాజన్‌ చెలరేగడంతో భారత్‌ 11 పరుగుల తేడాతో కంగారూ జట్టును ఓడించింది. రెండో టీ20 ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి..

అందుకే కెప్టెన్సీ వదులుకున్నా

అప్పుడు బుమ్రా.. ఇప్పుడు నట్టూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని