IND vs NZ: భజ్జీని అధిగమించిన అశ్విన్‌..

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్.. మాజీ దిగ్గజ స్పిన్నర్‌

Published : 29 Nov 2021 19:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్.. మాజీ దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ (103 టెస్టుల్లో 417 వికెట్లు)ను అధిగమించాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌ అశ్విన్‌ (419)‌గా రికార్డుల్లోకెక్కాడు. 80 టెస్టుల్లోనే అశ్విన్‌ ఈ ఘనత సాధించడం విశేషం. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (619), మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్‌ (434) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.  

అశ్విన్‌ సాధించిన ఘనతపై మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. ‘నేను భారత్‌ తరఫున ఆడుతున్న సమయంలో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం అశ్విన్‌ కూడా గొప్పగా రాణిస్తున్నాడు. మా ఇద్దరికీ పోలికలు అవసరం లేదు. అరుదైన మైలురాయిని చేరుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌కు శుభాకాంక్షలు. టీమ్‌ఇండియాకి అతడు మరెన్నో విజయాలు అందించాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని