రంజీకి బదులు విజయ్ హజారె ట్రోఫీ
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా 2020-21 సీజన్లో రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్ హజారె ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు లేఖ రాశారు. ఈ కరోనా మహమ్మారి అందరినీ పరీక్షించిందని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో రాష్ట్ర సంఘాల మద్దతుతోనే పురుషుల దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించామని షా పేర్కొన్నారు. అయితే, 2020-21 సీజన్లో విలువైన సమయాన్ని కోల్పోయామన్నారు. దాంతో ఈ ఏడాది క్రికెట్ మ్యాచ్‌ల ప్రణాళికలు రూపొందించడానికి కష్టతరమైందని వివరించారు.
అలాగే మహిళల క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం కూడా ముఖ్యమని బీసీసీఐ సెక్రటరీ గుర్తుచేశారు. ‘ఈ విషయాన్ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నా. సీనియర్ మహిళల వన్డే క్రికెట్‌తో పాటు విజయ్ హజారె, అండర్-19 క్రికెటర్లకు వినో మన్కడ్ ట్రోఫీలు నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ సీజన్లో దేశవాళీ క్రికెట్ నిర్వహణపై మీ నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని షా పేర్కొన్నారు. కాగా, మార్చి నెలాఖరున ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఫిబ్రవరిలోనే విజయ్ హజారె ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. ఈ ట్రోఫీ కోసం ఆరు బయో బుడగలను ఏర్పాటు చేస్తుండగా ఆటగాళ్లంతా వచ్చే వారమే అందులోకి అడుగుపెడతారని తెలుస్తోంది.
ఇవీ చదవండి..
‘గాయ’పడ్డ కెరీర్లు.. జాగ్రత్త క్రికెటర్లూ!
కోహ్లీని ఔట్ చేసే వ్యూహమదే: ఇంగ్లాండ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్‌లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
PV Sindhu: కామన్వెల్త్లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు
-
India News
Quit India: నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- PV Sindhu: కామన్వెల్త్లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!