ఓటమిపై సాకులు వద్దు.. పున:సమీక్షించండి

ఇంగ్లాండ్ చేతిలో భారత్‌ ఓటమిపాలవ్వడంపై మాజీ క్రికెటర్‌ బిషన్‌ బేడి తీవ్రంగా స్పందించారు. ఎస్‌జీ బంతి, పిచ్‌, టాస్‌...

Updated : 10 Feb 2021 15:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్ చేతిలో భారత్‌ ఓటమిపాలవ్వడంపై మాజీ క్రికెటర్‌ బిషన్‌సింగ్‌ బేడి తీవ్రంగా స్పందించారు. ఎస్‌జీ బంతి, పిచ్‌, టాస్‌ వంటి కారణాలు చెప్పకుండా ఓటమిపై పునఃసమీక్షించాలని టీమిండియాకు సూచించారు. ‘‘నిన్న మ్యాచ్‌ను చూడలేకపోయాను. అయితే విజయం అందుకోవడంలో ఇరు జట్లకూ అవకాశముంటుంది. కానీ ఎస్‌జీ బంతి, వికెట్, టాస్‌ వంటి సాకులు చెప్పకూడదు. ఇంగ్లాండ్ జట్టును అభినందించినట్లుగానే ఓటమిపై పునఃసమీక్షించుకోవాలి. ప్రత్యర్థి జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు’’ అని బేడీ ట్వీట్ చేశారు.

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఎస్జీ బంతులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి నాణ్యత సంతృప్తికరంగా లేదు, గతంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నామని అన్నాడు. మ్యాచ్‌లో టాస్‌ కీలకమే కానీ, ఇంగ్లాండ్ ఘనతను ఏమాత్రం తగ్గించాలనుకోట్లేదని పేర్కొన్నాడు. ఓటమిపై సాకులు చెప్పమని, జట్టు వైఫల్యాల్ని అంగీకరిస్తున్నామని తెలిపాడు. కాగా, చెన్నైలోనే శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి

తప్పులు, వైఫల్యాల్ని కోహ్లీ అంగీకరిస్తాడు

వచ్చే మ్యాచ్‌లో కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడు: నెహ్రా

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని