Yusuf Pathan: అరుణాచల్‌ ప్రదేశ్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన పఠాన్‌ బ్రదర్స్‌

టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌లు అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. యువ ఆటగాళ్లకు..

Published : 12 Mar 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ‘క్రికెట్ అకాడమీ ఆఫ్‌ పఠాన్స్‌’ (సీఏపీ) పేరిట ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రెయినింగ్‌ సెంటర్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈ అకాడమీ 28వది కావడం గమనార్హం.

‘ఇటానగర్ పరిసర ప్రాంతాల్లోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అరుణాచల్ ప్రదేశ్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నాం. ప్రపంచస్థాయి కోచింగ్ అందించడం ద్వారా మా అకాడమీలో శిక్షణ పొందిన ఆటగాళ్లు పలు జిల్లా, రాష్ట్ర స్థాయి జట్ల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బిహార్‌లోని మా అకాడమీలో శిక్షణ పొందిన యశస్వీ రిషవ్‌ బిహార్‌ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల అద్భుత శతకం కూడా బాదాడు. ఇంకా చాలా మంది యువ ఆటగాళ్లు కూచ్‌ బిహార్ ట్రోఫీ, సీ కే నాయుడు ట్రోఫీల్లో సత్తా చాటుతున్నారు. అలాగే, జైపూర్‌ అకాడమీ నుంచి ఏడుగురు ఆటగాళ్లు రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నారు. రానున్న కాలంలో మరిన్ని నగరాల్లో మా అకాడమీలను ప్రారంభిస్తాం’ అని యూసుఫ్‌ పఠాన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని