Hardik Pandya: WWEలోకి వెళ్లిన హార్దిక్‌ పాండ్య..? వైరల్‌ ఫొటోలు!

టీమ్‌ఇండియా స్టార్‌ హిట్టర్‌ హార్దిక్‌ పాండ్య ఇప్పుడు వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్ (WWE)లోకి ప్రవేశించాడని అభిమానులు ఛలోక్తులు విసురుతున్నారు. తాజాగా పాండ్యను పోలిన ఓ రెజ్లర్‌...

Published : 25 Feb 2022 15:45 IST

(Photos: Hardik Instagram, Carmelo Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ హిట్టర్‌ హార్దిక్‌ పాండ్య ఇప్పుడు వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (WWE)లోకి ప్రవేశించాడని అభిమానులు ఛలోక్తులు విసురుతున్నారు. తాజాగా పాండ్యను పోలిన ఓ రెజ్లర్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే అందుకు కారణం. WWE NXT స్టార్‌ రెజ్లర్‌ కార్మెలో హేస్‌.. చూడటానికి అచ్చం పాండ్యలాగే ఉండటంతో అతడి ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన భారత్‌లోని పలువురు నెటిజన్లు ఆ ఫొటోలకు తమ క్రియేటివిటీ జోడించారు. దీంతో హార్దిక్‌ పాండ్య క్రికెట్‌ వదిలేసి రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టాడని, ఇటీవల వెంకటేశ్‌ అయ్యర్‌ ఆట చూశాక అతడు క్రికెట్‌ వీడాడని, ఇప్పుడు టీమ్‌ఇండియాలోకి వచ్చేందుకు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని ఇలా రకరకాలుగా సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక ఈ విషయం చివరికి కార్మెలో హేస్‌కు చేరడంతో ఇటీవల అతడు స్పందించాడు. ‘భారత్‌లో నా లాంటి పోలికలున్న హార్దిక్‌ పాండ్య ట్రెండ్‌ అవుతున్నాడు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉండగా.. హార్దిక్‌ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో విఫలమయ్యాక టీమ్‌ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు అతడు రాబోయే ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌పైనా దృష్టిసారించాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో మెగా ఈవెంట్‌లో ఆ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. అయితే, ఇటీవల వెస్టిండీస్‌ సిరీస్‌లో కొత్తగా జట్టులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ ఆటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. దీంతో చాలా మంది టీమ్‌ఇండియా అభిమానులు పాండ్యకు దీటుగా సరైన ఆల్‌రౌండర్‌ దొరికాడని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని