T20 World Cup: ‘కమాన్.. ఇండియా మొత్తం మన వెంట ఉంది’
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటి అనుకుంటున్నారా.. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్కాట్లాండ్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటి అనుకుంటున్నారా.. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్కాట్లాండ్ వికెట్‌కీపర్ మాథ్యూ క్రాస్ నోటి వెంట భారత్ పేరు రావడం. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్ గ్రీవ్స్ వేసిన ఎనిమిదో ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ చేశాడు. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాం నింపడం కోసం ‘కమాన్.. ఇండియా మొత్తం మన వెంట ఉంది’ అని మాథ్యూ క్రాస్ అన్నాడు. ఈ మాటలు వికెట్లలో ఉండే మైక్‌లలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కొంతమంది ట్విటర్లో పోస్టు చేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, స్కాట్లాండ్ వికెట్ కీపర్ అలా మాట్లాడటానికి ఓ కారణం ఉంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినా సాంకేతికంగా మాత్రం భారత్‌కు ఇంకా సెమీస్ చేరే అవకాశం ఉంది. అది ఎలాగంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా భారీ తేడాతో గెలవడంతోపాటు స్కాట్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఈ కారణంగానే స్కాట్లాండ్ వికెట్ కీపర్ ఆ విధంగా మాట్లాడాడు. అయితే, ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ 16 పరుగుల తేడాతో ఓడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. మార్టిన్ గప్తిల్ (93; 56 బంతుల్లో 4x6, 6X7) దంచికొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్ (33) రాణించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లే వీల్ రెండేసి, మార్క్ వాట్ ఒక వికెట్ తీశారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. దీంతో స్కాట్లాండ్ ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం