IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK Vs GT) మధ్య నిన్న జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లో నేడు కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) మధ్య ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ (IPL Final) మ్యాచ్ భారీ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేడు కూడా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ జరగాల్సి ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అయితే, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికల్లా వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
అభిమానుల్లో ఆందోళన
రిజర్వ్ డే రోజు కూడా వర్ష సూచన ఉండటంతో ఫైనల్ మ్యాచ్ గురించి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించొద్దని అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ కూడా వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. గుజరాత్ 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించింది. మరో ఫైనలిస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలను అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు