Medvedev: కోర్టులోనే కోచ్‌పై గట్టిగా అరిచిన మెద్వెదేవ్‌.. వీడియో వైరల్

రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ 1 ఆటగాడు డేనిల్‌ మెద్వెదేవ్‌ తన కోచ్‌పై అరిచిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది...

Updated : 08 Dec 2022 17:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ 1 ఆటగాడు మెద్వెదేవ్‌ తన కోచ్‌పై అరిచిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆదివారం జర్మనీలో జరిగిన హాలే ఓపెన్‌ ఫైనల్లో పోలాండ్‌ ఆటగాడు హుబర్ట్‌ హుర్కాజ్‌ చేతిలో 6-1, 6-4 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు గ్రాస్‌ కోర్ట్‌ ఫైనల్లో వరుసగా రెండోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఈవెంట్‌లో మెద్వెదేవ్‌ ఒక్కసారిగా తన కోచ్‌ గైల్స్‌ సెర్వెరాపై కోర్టులోనే గట్టిగా అరిచాడు. దీంతో ఆ కోచ్‌ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఆ వీడియోను టెన్నిస్‌ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు మెద్వెదేవ్‌ తీరుపై మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని