
Dhoni-Bravo: ధోని లేనిదే నా కెరీర్ లేదు : డ్వేన్ బ్రావో
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లేనిదే తన కెరీర్ లేదని వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్నాడు. తాను క్రికెట్ కెరీర్లో ఎదిగేందుకు ధోని వ్యక్తిగతంగా చాలా సహాయపడ్డాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టుతో తమ బంధం విడదీయలేనిదని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడిన బ్రావో పలు విషయాలు వెల్లడించాడు.
‘వచ్చే సీజన్ కోసం చెన్నై యాజమాన్యం నన్ను అట్టి పెట్టుకోలేదు. వేలంలో మళ్లీ నన్ను దక్కించుకుంటుందని కూడా కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం నేను వేలంలో ఉన్నాను. ఏ జట్టు కొనుగోలు చేస్తుందో తెలియదు. చెన్నై కెప్టెన్ ధోనితో నా అనుబంధం ఎలాంటిదో మీకందరికీ తెలుసు. ఒకరినొకరం బ్రదర్ అని పిలుచుకునే వాళ్లం. ధోని లేనిదే నా కెరీర్ లేదు. నా క్రికెట్ కెరీర్ ఎదుగుదలకు ధోని వ్యక్తిగతంగా చాలా తోడ్పడ్డాడు. చెన్నై జట్టుతో మా అనుబంధం విడదీయలేనిది’ అని బ్రావో పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్-2022 సీజన్‌కి సంబంధించి సీఎస్కే యాజమాన్యం ఇప్పటికే రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయీన్ అలీలను రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.