
Published : 16 Aug 2021 01:48 IST
Mohammed Siraj: సిరాజ్ ష్..! సైగల వెనుక అసలు కారణం ఇదే!
లండన్: ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అయితే, నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టులో, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో మునుపెన్నడూ లేనంత దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. వికెట్ తీసిన ప్రతిసారి నోటి మీద వేలు ఉంచి ‘ష్..’అంటూ సైగలు చేస్తున్నాడు.
కాగా, ఈ సైగల వెనకున్న అసలు విషయాన్ని రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసిన అనంతరం సిరాజ్ బయటపెట్టాడు. ‘‘నన్ను విమర్శించే వారినుద్దేశించి ఈ రకంగా సంబరాలు చేసుకుంటున్నా. ఎందుకంటే వారికి నా గురించి ఎన్నో ఆలోచనలుంటాయి. అవి ఎలాంటివంటే.. ‘అతడి వల్ల ఇది సాధ్యం కాదు..’ ‘అలా చేయలేడు.’ కాబట్టి నా బంతితో మాత్రమే సమాధానం చెబుతా. సంబరం చేసుకోవడంలో ఇది నా కొత్త స్టైల్’’ అని సిరాజ్ అన్నాడు.
ఇవీ చదవండి
Tags :