Virat - Babar: విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

విరాట్ కోహ్లీ (Virat Kohli), బాబర్ అజామ్ (Babar Azam) ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో టాప్ ఆటగాళ్లు. అయితే విరాట్‌తో అజామ్‌ను పోల్చడం ఇప్పుడే సరైంది కాదని పాక్‌ మాజీ కెప్టెన్‌ వ్యాఖ్యానించాడు. 

Published : 30 Jan 2023 01:16 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండో ఏడాది ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’  అవార్డును పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 95 వన్డేల్లో 17 శతకాలు, 24 అర్ధశతకాలతో 4,813 పరుగులు సాధించాడు. దీంతో మరోసారి టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీతో బాబర్ అజామ్‌ను పోలుస్తూ క్రికెట్ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే పాక్‌ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మాత్రం ఇలా పోల్చడాన్ని కొట్టిపడేశాడు. వీరిద్దరూ తమ క్రికెట్ కెరీర్‌లో వివిధ స్థాయిల్లో ఉన్నారని, అందుకే ‘పోలిక’ సరైంది కాదన్నాడు. 

‘‘ఇద్దరి మధ్య పోల్చడం ఇప్పుడే సరైంది కాదు. విరాట్ కోహ్లీ చాలా క్రికెట్‌ ఆడాడు. కానీ బాబర్ ఇప్పుడే మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కోహ్లీ ఆడినన్ని మ్యాచ్‌లను బాబర్ అజామ్‌ ఆడతాడో.. అప్పుడు ఇద్దరిని పోల్చుకోవచ్చు. అందుకే విరాట్ కోహ్లీతో ఇప్పుడు ఎవరూ సరితూగరు. బాబర్‌ క్లాస్‌ ప్లేయర్. కోహ్లీ సాధించిన ఘనతలను భవిష్యత్తులో బాబర్ సాధిస్తాడు’’ అని మిస్బా తెలిపాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆసియా కప్‌ మెగా టోర్నీలో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి వరుసగా శతకాలు చేస్తూ విరాట్ అదగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం కివీస్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు