FIFA World Cup 2022: ఈక్వెడార్‌ అభిమానుల అత్యుత్సాహం.. ఫిఫా క్రమశిక్షణ చర్యలు

ప్రపంచకప్‌ 2022లో మొదటి క్రమశిక్షణ చర్యను చేపట్టింది ఫిఫా పాలకమండలి. మ్యాచ్‌ సందర్భంగా  ఈక్వెడార్‌ అభిమానులు చేసిన నినాదాలే ఇందుకు కారణం.

Updated : 23 Nov 2022 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ఫిఫా ప్రపంచకప్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇక తమ జట్లను ప్రోత్సహిస్తూ అభిమానులు చేసే సందడికి కొదవే లేదు. అయితే ఓ జట్టు అభిమానులు చూపిన అత్యుత్సాహం.. ఇప్పుడు ఫిఫా క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకూ వెళ్లింది.

నవంబర్‌ 20న ఆతిథ్య ఖతార్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈక్వెడార్‌ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే.. ఇవి వివాదాస్పదం కావడంతో ఫిఫా పాలక మండలి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈక్వెడార్‌ అభిమానులు చేసిన నినాదాల్లో వివక్షపూరిత పదాలు, తిట్లు ఉన్నాయని.. ఆర్టికల్‌ 13 కింద దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు  ఫిఫా వెల్లడించింది. ఈ మేరకు ఈక్వెడార్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌పై చర్యలను ప్రారంభించినట్లు ఫిఫా క్రమశిక్షణ కమిటీ తెలిపింది. అయితే వారు ఉపయోగించిన పదాలు ఏంటో మాత్రం చెప్పలేదు.

ఫిఫా ప్రపంచకప్‌ 2022లో మొదటి క్రమశిక్షణ చర్య ఇదే. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్‌ను ఈక్వెడార్‌ 2-0 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని