Sports News: ఖేల్‌రత్న రేసులో కోనేరు హంపి

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ కోనేరు హంపిని అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఐఏసీఎఫ్‌) ప్రతిష్టాత్మక రాజీవ్‌

Published : 02 Jul 2021 09:07 IST

సాయిప్రణీత్‌, శ్రీకాంత్ కూడా..

దిల్లీ: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ కోనేరు హంపిని అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఐఏసీఎఫ్‌) ప్రతిష్టాత్మక రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది జరిగే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించిన ప్రపంచ మూడో ర్యాంకర్‌ హంపి.. 2020 ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌ టైటిల్‌ గెలిచిన భారత జట్టులో సభ్యురాలు కూడా. గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌బాబు, విదిత్‌ గుజరాతీ, అధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్‌ల పేర్లను ఏఐసీఎఫ్‌ అర్జున అవార్డులకు సిఫార్సు చేసింది. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లు భమిడిపాటి సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్‌ పేర్లను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్‌ కాంస్య పతకంతో మెరిశాడు. 2017లో శ్రీకాంత్‌ 4 సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు సాధించాడు. ప్రణయ్, ప్రణవ్‌ చోప్రా, సమీర్‌వర్మల పేర్లను అర్జున అవార్డుల కోసం బాయ్‌ సిఫార్సు చేసింది. కోచ్‌లు భాస్కర్‌బాబు, మురళీధరన్‌లను దోణాచార్య పురస్కారానికి ప్రతిపాదించింది. పీవీవీ లక్ష్మి, లెరోయ్‌ డిసాలను   ధ్యాన్‌చంద్‌ అవార్డులకు సిఫార్సు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని