బాబర్‌కు రెండు పురస్కారాలు

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాంకు రెండు ఐసీసీ పురస్కారాలు లభించాయి. 2022 సంవత్సరానికి గాను ఐసీసీ ఉత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డుకు అతను ఎంపికయ్యాడు.

Published : 27 Jan 2023 03:15 IST

దుబాయ్‌: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాంకు రెండు ఐసీసీ పురస్కారాలు లభించాయి. 2022 సంవత్సరానికి గాను ఐసీసీ ఉత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డుకు అతను ఎంపికయ్యాడు. పురుషుల క్రికెట్లో 2022 ఐసీసీ అత్యుత్తమ ఆటగాడి అవార్డూ బాబర్‌ను వరించింది. ఈ అవార్డు గెలుచుకున్న బాబర్‌కు సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీని బహుకరిస్తారు. 2022 ఐసీసీ ఉత్తమ టెస్టు క్రికెటర్‌ అవార్డును ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ మహిళల జట్టు కెప్టెన్‌ నాట్‌ స్కివర్‌కు కూడా రెండు పురస్కారాలు దక్కాయి. 2022 ఐసీసీ మహిళల ఉత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డు సొంతం చేసుకుంది. ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌ అవార్డునూ గెలుచుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఐసీసీ ఉత్తమ అంపైర్‌గా ఎంపికయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు