ఆఖరి మెట్టుపై బోల్తా

మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది.

Published : 03 Feb 2023 03:47 IST

దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి
మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌

ఈస్ట్‌ లండన్‌: మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. మందకొడి పిచ్‌పై తడబడిన భారత్‌ మొదట    4 వికెట్లకు 109 పరుగులే చేసింది. రెండో ఓవర్లోనే స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (0) వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియా.. 4 ఓవర్లకు 3 పరుగులే చేసింది. ఈ స్థితిలో హర్లీన్‌ డియోల్‌ (46; 56 బంతుల్లో 4×4) జట్టును ఆదుకుంది. ఆమెకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (21), దీప్తిశర్మ (16 నాటౌట్‌) అండగా నిలవడంతో భారత్‌ స్కోరు వంద దాటింది. మాల్బా (2/16), కాకా (1/17), సన్‌ లజ్‌ (1/22) భారత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా 6.3 ఓవర్లలో 21/3తో తడబడింది. కానీ క్లోయి ట్రయాన్‌ (57 నాటౌట్‌; 32 బంతుల్లో 6×4, 2×6) మెరుపులతో సఫారీలకు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. ఒంటిచేత్తో ఇన్నింగ్స్‌ను నడిపించిన ట్రయాన్‌.. డిక్లెర్క్‌ (17 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని