టీవీ చూసినప్పుడల్లా...

అయిదు నెలల విరామం తర్వాత మళ్లీ భారత క్రికెట్‌ జెర్సీని ధరించడం గొప్పగా అనిపిస్తోందని స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు.

Published : 06 Feb 2023 01:29 IST

నాగ్‌పుర్‌: అయిదు నెలల విరామం తర్వాత మళ్లీ భారత క్రికెట్‌ జెర్సీని ధరించడం గొప్పగా అనిపిస్తోందని స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. నిరుడు టీ20 ప్రపంచకప్‌కు దూరం కావడం బాధ కలిగించిందని.. టీవీ చూసినప్పుడల్లా నేనూ ఆడాల్సింది కదా అనుకునేవాడినని జడ్డూ పేర్కొన్నాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న జడ్డూ.. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ‘‘అయిదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జెర్సీని ధరించడం గొప్పగా అనిపిస్తోంది. అంతకాలం ఎప్పుడూ ఆటకు దూరంగా లేను. అందుకే ఎప్పుడెప్పుడు బరిలో దిగుతానా అని ఎదురు చూస్తున్నా’’ అని జడేజా తెలిపాడు. మోకాలి శస్త్ర చికిత్సను ప్రపంచకప్‌కు ముందు చేయించుకోవాల్సి రావడం బాధించిందని అతడు చెప్పాడు. ‘‘శస్త్ర చికిత్స తర్వాత కోలుకునే ప్రక్రియ చాలా క్లిష్టంగా గడిచింది. ప్రపంచకప్‌ మ్యాచ్‌లు టీవీలో చూస్తున్నప్పుడు నేనూ ఆడాల్సింది కదా అనుకునేవాడిని. ఇలాంటి విషయాలే వేగంగా కోలుకునేందుకు స్ఫూర్తినిచ్చాయి. జాతీయ క్రికెట్‌ అకాడమీ నా పునరాగమనంలో కీలకపాత్ర పోషించింది’’ అని జడ్డూ చెప్పాడు. గత నెల తమిళనాడుతో రంజీ మ్యాచ్‌తో జడేజా మళ్లీ మైదానంలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి ఫామ్‌ నిరూపించుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని