రుద్రాంక్ష్‌కు మరో పతకం

ప్రపంచకప్‌ షూటింగ్‌లో మరో పతకం భారత్‌ సొంతమైంది. ఎయిర్‌రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో ఇప్పటికే కాంస్యం గెలిచిన రుద్రాంక్ష్ పాటిల్‌.. వ్యక్తిగత విభాగంలోనూ కంచు కైవసం చేసుకున్నాడు.

Updated : 25 Mar 2023 03:08 IST

భోపాల్‌: ప్రపంచకప్‌ షూటింగ్‌లో మరో పతకం భారత్‌ సొంతమైంది. ఎయిర్‌రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో ఇప్పటికే కాంస్యం గెలిచిన రుద్రాంక్ష్ పాటిల్‌.. వ్యక్తిగత విభాగంలోనూ కంచు కైవసం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌ ఆరంభంలో ఆధిక్యంలో నిలిచిన రుద్రాంక్ష్.. చివరికి 631 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి ఎనిమిది మంది పోటీపడే ర్యాంకింగ్‌ రౌండ్‌కు అర్హత సాధించాడు. ర్యాంకింగ్‌ రౌండ్లో స్థిరంగా రాణించిన రుద్రాంక్ష్.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా షూటర్లు సెహెంగ్‌, లిన్‌షూలకు గట్టిపోటీ ఇచ్చాడు. కానీ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో రమితకు అదృష్టం కలిసి రాలేదు. 52 మంది పోటీపడిన ఈవెంట్లో క్వాలిఫికేషన్లో 632.8తో రెండో స్థానంలో నిలిచిన భారత షూటర్‌.. ర్యాంకింగ్‌ రౌండ్లో 260.5 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి కొద్దిలో పతకానికి దూరమైంది. ఈ విభాగంలో హంగ్‌ యుటింగ్‌ (చైనా) స్వర్ణం గెలవగా.. టకర్‌ మేరీ (అమెరికా), అలెగ్జాండ్రా లీ (కజకిస్థాన్‌) కాంస్యం నెగ్గారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని