Asia cup: పాక్‌ చేజారిన ఆసియాకప్‌ ఆతిథ్యం!

పాకిస్థాన్‌కు షాక్‌! ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ ఆతిథ్యం ఆ దేశం చేజారింది. సెప్టెంబర్‌ 2న ఆరంభం కావాల్సిన ఈ టోర్నీని పాక్‌ నుంచి మరో చోటకు తరలించాలని సోమవారం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది.

Updated : 09 May 2023 08:57 IST

లంకలో నిర్వహించే అవకాశం

దిల్లీ: పాకిస్థాన్‌కు షాక్‌! ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ ఆతిథ్యం ఆ దేశం చేజారింది. సెప్టెంబర్‌ 2న ఆరంభం కావాల్సిన ఈ టోర్నీని పాక్‌ నుంచి మరో చోటకు తరలించాలని సోమవారం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. టోర్నీ పాక్‌లోనే జరిగినా.. భారత్‌ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడాలని ఆ దేశం చేసిన ‘హైబ్రిడ్‌ మోడల్‌’ ప్రతిపాదనను మిగిలిన సభ్య దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ సర్వసభ్య సమావేశంలో చర్చించి ఛైర్మన్‌ జైషా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నాడు. టోర్నీని శ్రీలంకలో నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి.

అయితే మంగళవారం జరిగే రెండో దఫా చర్చల్లో ఏసీసీ తన మనసు మార్చుకుంటుందేమోనని పాక్‌ ఆశతో ఉంది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌కు తమ జట్టును పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో పాక్‌ చిక్కుల్లో పడింది. ఆ తర్వాత ఎన్నో చర్చలు జరిగినా.. రకరకాల ప్రతిపాదనలు చేసినా సమస్య తేలలేదు. ‘‘పాకిస్థాన్‌ చేసిన తటస్థ దేశంలో భారత్‌ మ్యాచ్‌ల ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ భారత్‌, పాక్‌ ఒకే గ్రూప్‌లో ఉంటే మూడో జట్టు అటు పాక్‌, ఇటు యూఏఈకి తిరుగుతూ మ్యాచ్‌లు ఆడాలి’’ అని ఏసీసీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని