మెద్వెదెవ్‌కు షాక్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పెను సంచలనం. రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కథ మొదటి రౌండ్లోనే ముగిసింది. అయిదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మారథాన్‌ పోరులో క్వాలిఫయర్‌ సెబోత్‌ వైల్డ్‌ (బ్రెజిల్‌) 7-6 (7-5), 6-7 (6-8), 2-6, 6-3, 6-4తో మెద్వెదెవ్‌కు షాకిచ్చాడు.

Published : 31 May 2023 02:40 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పెను సంచలనం. రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కథ మొదటి రౌండ్లోనే ముగిసింది. అయిదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మారథాన్‌ పోరులో క్వాలిఫయర్‌ సెబోత్‌ వైల్డ్‌ (బ్రెజిల్‌) 7-6 (7-5), 6-7 (6-8), 2-6, 6-3, 6-4తో మెద్వెదెవ్‌కు షాకిచ్చాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 172వ స్థానంలో ఉన్న వైల్డ్‌ ఇంతకుముందెప్పుడూ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ నెగ్గలేదు. వైల్డ్‌ 69 విన్నర్లు కొట్టగా.. మెద్వెదెవ్‌ 45 మాత్రమే కొట్టాడు. మెద్వెదెవ్‌ 14 ఏస్‌లు సందించాడు కానీ.. ఏకంగా 15 డబుల్‌ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు నాలుగో సీడ్‌ రూడ్‌ (నార్వే) రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మొదటి రౌండ్లో అతడు 6-4, 6-3, 6-2తో యెమెర్‌ (స్వీడన్‌ను)ను మట్టికరిపించాడు. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రూడ్‌ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టాడు. 22వ సీడ్‌ జ్వెరెవ్‌ కూడా ముందంజ వేశాడు. తొలి రౌండ్లో అతడు 7-6 (8-6), 7-6 (7-0), 6-1తో లాయిడ్‌ హారిస్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో పాల్‌ 6-3, 6-2, 6-4తో స్ట్రికర్‌పై, మొల్కాన్‌ 6-1, 7-6 (7-4), 6-4తో గాస్టన్‌పై, వవసోరి 5-7, 2-6, 7-6 (10-8), 7-6 (7-3), 7-6 (11-9)తో కెక్మనోవిచ్‌పై, నిషియోక 1-6, 3-6, 6-4, 6-3, 6-3తో వూల్ఫ్‌పై, జారీ 6-4, 6-4, 6-2తో డెలియన్‌పై విజయం సాధించారు.

రిబకినా ముందుకు: మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ రిబకినా బోణీ కొట్టింది. మొదటి రౌండ్లో ఆమె 6-4, 6-2తో ఫ్రవిర్‌తోవాను ఓడించింది. రిబకినా 9 ఏస్‌లు, 33 విన్నర్లు కొట్టింది. ఆరో సీడ్‌ గాఫ్‌, ఏడో సీడ్‌ జాబెర్‌ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. గాఫ్‌ 3-6, 6-1, 6-2తో మసరోవా (స్పెయిన్‌)పై నెగ్గగా.. జాబెర్‌ 6-4, 6-1తో బ్రొంజెటి (ఇటలీ)ని మట్టికరిపించింది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) 6-4, 6-0తో బుస్కా (స్పెయిన్‌)పై, రెబెక్కా 6-2, 6-0తో ఫెరోపై, దోడిన్‌ 0-6, 6-2, 6-1తో జనిసెవిచ్‌పై, వాంగ్‌ 6-4, 7-6 (7-5)తో బౌజ్కోవాపై, పారీ 6-2, 6-3తో కల్నినాపై, సురెంకో 6-2, 6-4తో క్రెజికోవాపై విజయం సాధించారు.


మెయిన్‌ డ్రాకు సమీర్‌, కిరణ్‌

బ్యాంకాక్‌: గాయం నుంచి కోలుకుని ఇటీవలే పునరాగమనం చేసిన ప్రపంచ మాజీ నం.11 సమీర్‌ వర్మ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో మెయిన్‌డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం అర్హత మ్యాచ్‌లో 28 ఏళ్ల సమీర్‌ 21-12, 21-17తో యో సెంగ్‌ జో (మలేసియా)ను ఓడించాడు. కిరణ్‌ జార్జి, మహిళల సింగిల్స్‌లో అస్మిత చాలిహ కూడా ప్రధాన టోర్నీకి చేరారు. కిరణ్‌ 21-10, 21-14తో జోన్‌ హయక్‌ (కొరియా)పై గెలిచాడు. అస్మిత 21-19, 21-11తో క్రిస్టిన్‌ కుబ (ఎస్తోనియా)పై విజయం సాధించింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని