భారత్‌ ఇద్దరు స్పిన్నర్లతో..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లను ఆడించే అవకాశముందని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు.

Published : 01 Jun 2023 01:56 IST

లండన్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లను ఆడించే అవకాశముందని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. ఈ నెల 7న మొదలయ్యే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న ఓవల్‌ మైదానంలో పరిస్థితులు భారత్‌కు దగ్గరగా ఉంటాయి కాబట్టి భారత్‌ ఈ ఆలోచన చేయొచ్చని స్మిత్‌ చెప్పాడు. ‘‘ఓవల్‌లో మామూలుగానే స్పిన్‌కు కొంత సహకారం ఉంటుంది. మ్యాచ్‌ సాగేకొద్దీ భారత్‌ తరహా పరిస్థితులు ఉంటాయి. అయితే క్రికెట్‌ ఆడేందుకు ఓవల్‌ అద్భుతమైన మైదానం. అక్కడ ఔట్‌ ఫీల్డ్‌ వేగంగా ఉంటుంది. ఆ మైదానంలో బ్యాటింగ్‌ చేయడం బాగుంటుంది. పిచ్‌పై బౌన్స్‌, పేస్‌ ఉంటాయి’’ అని అతనన్నాడు. ఓవల్‌ మైదానంలో భారత్‌ లాంటి ప్రత్యర్థితో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడబోతుండటం తనకెంతో ఉత్సాహాన్నిస్తోందని స్మిత్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని