రెజ్లర్లకు కపిల్‌డెవిల్స్‌ మద్దతు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అరెస్టు చేయాలని పోరాడుతున్న రెజ్లర్లకు 1983 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యులు మద్దతుగా నిలిచారు.

Updated : 03 Jun 2023 03:11 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అరెస్టు చేయాలని పోరాడుతున్న రెజ్లర్లకు 1983 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యులు మద్దతుగా నిలిచారు. రెజ్లర్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దని కపిల్‌ డెవిల్స్‌ బృందం కోరింది. ఈ మేరకు వాళ్లు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ‘‘భారత ఛాంపియన్‌ రెజ్లర్లను పోలీసులు నెట్టేయడం.. దురుసుగా లాక్కెళ్లడం లాంటి దృశ్యాలు చూసి కలత చెందాం. ఎంతో కష్టపడి సాధించుకున్న పతకాలను గంగలో కలుపుతామని వారు అన్న మాటలు ఆందోళన కలిగించాయి. ఎన్నో ఏళ్ల శ్రమ, కృషి, అంకితభావం వల్లే ఈ పతకాలు వచ్చాయి. వారికే కాదు దేశానికి ఈ పతకాలు గర్వకారణమే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారిని మా జట్టు తరఫున కోరుతున్నాం. రెజ్లర్ల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం’’ అని కపిల్‌డెవిల్స్‌ ఈ ప్రకటనలో పేర్కొంది. 1983 ప్రపంచకప్‌ ఫైనల్లో బలమైన వెస్టిండీస్‌ను ఓడించి కప్‌ గెలిచిన భారత జట్టుకు కపిల్‌దేవ్‌ సారథి కాగా.. సునీల్‌ గావస్కర్‌, రోజర్‌ బిన్నీ, మొహిందర్‌ అమర్‌నాథ్‌, శ్రీకాంత్‌, కిర్మాణీ, యశ్పాల్‌ శర్మ, మదన్‌లాల్‌, బల్వీందర్‌ సంధు, సందీప్‌ పాటిల్‌, కీర్తి ఆజాద్‌ సభ్యులు. రోజర్‌ బిన్నీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు