Marnus Labuschagne: ఆస్ట్రేలియా వికెట్‌ పడింది.. లబుషేన్‌ నిద్ర లేచాడు

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభ సమయంలో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌, ఖవాజా బ్యాటింగ్‌కు వెళ్లగా.. మూడో స్థానంలో ఆడాల్సిన లబుషేన్‌ తన వంతు వచ్చే లోపు చిన్న కునుకు వేద్దామనుకున్నాడు.

Updated : 10 Jun 2023 12:32 IST

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభ సమయంలో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌, ఖవాజా బ్యాటింగ్‌కు వెళ్లగా.. మూడో స్థానంలో ఆడాల్సిన లబుషేన్‌ తన వంతు వచ్చే లోపు చిన్న కునుకు వేద్దామనుకున్నాడు. ఓవల్‌లో డ్రెస్సింగ్‌ రూం ముంగిట అతను కుర్చీలో కూర్చుని ప్యాడ్లతోనే నిద్రపోయాడు. అయితే నాలుగో ఓవర్లోనే వార్నర్‌ ఔటైపోయాడు. వికెట్‌ పడ్డ విషయం తెలిసి ఉలిక్కి పడి లేచిన లబుషేన్‌ హడావుడిగా గ్లవ్స్‌ తొడుక్కుని, బ్యాట్‌ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. నిద్ర మత్తుతో బ్యాటింగ్‌కు వచ్చినా చురుగ్గా బ్యాటింగ్‌ చేసిన లబుషేన్‌ మూడో రోజు ఆట చివరికి 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని