లంకకు కష్టమే కానీ..
వరుసగా 13 వన్డేవిజయాలు.. 2022 ఆసియాకప్‌లో టైటిల్ కైవసం.. 2023లో రన్నరప్! శ్రీలంక జోరు ఇది.
ఎవరి సత్తాఎంత?
వరుసగా 13 వన్డేవిజయాలు.. 2022 ఆసియాకప్‌లో టైటిల్ కైవసం.. 2023లో రన్నరప్! శ్రీలంక జోరు ఇది. అయితే ప్రపంచకప్‌లో మహామహా జట్లతో పోలిస్తే లంకను బలమైందిగా ఎంచలేం! అలా అని ఉపఖండ పరిస్థితుల్లో సత్తా చాటే ఈ జట్టును తీసి పారేయలేం. అందుకే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో శానక సారథ్యంలోని లంక ఓ డార్క్‌హార్స్. క్వాలిఫయింగ్ ద్వారా ఈ టోర్నీకి అర్హత సాధించిన ఈ జట్టు కప్‌లో అద్భుతాలు చేస్తుందో లేదో తెలియదు కానీ కొన్ని కీలక విజయాలు సాధించగలదు. అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో లంక కప్ వేటను ఆరంభించనుంది.
భారత్‌తో ఆసియాకప్ ఫైనల్లో 50 పరుగులకు ఆలౌట్ కావడం మినహాయిస్తే లంక మంచి ఫామ్‌లోనే ఉంది. వేగంగా కుదురుకుంటున్న ఆ జట్టులో యువ ఆటగాళ్లు సమష్టిగా సత్తా చాటుతున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా 2022 ఆసియాకప్ గెలవడం.. ఈసారి ఆసియాకప్‌లో రన్నరప్‌గా నిలవడం ఆ జట్టు ఎదుగుదలకు నిదర్శనం. స్టార్లు లేకపోయినా పట్టుదలగా ఆడుతూ విజయాలు సాధిస్తున్న లంక.. క్వాలిఫికేషన్ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా విజేతగా నిలిచి సత్తా చాటింది. శానక కెప్టెన్సీలో ఈ జట్టు 39 వన్డేల్లో 23 గెలిచింది. ఈ జోరు ప్రపంచకప్‌లోనూ ప్రదర్శిస్తుందా అన్నదే ఆసక్తికరం.
ఇదీ బలం: లంక జట్టుకు ప్రధాన బలం స్పిన్ బౌలింగే. స్పిన్నర్ హసరంగ, తీక్షణ ఆ జట్టు ప్రధాన స్పిన్ అస్త్రాలు. కొత్తగా వెల్లలాగె రూపంలో లంకకు కొత్త ఆయుధం వచ్చింది. ఇటీవల ఆ జట్టు సాధించిన విజయాల్లో స్పిన్నర్ల పాత్రే కీలకం. ప్రధాన స్పిన్నర్లకు తోడు అసలంక, ధనంజయ డిసిల్వా సైతం అప్పుడప్పుడూ సత్తా చాటుతున్నారు. ప్రపంచకప్ జరిగేది భారత్‌లో కావడం బలమైన స్పిన్ దళం ఉన్న లంకకు ప్లస్. పేసర్ పతిరనతో బ్యాటర్లకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. బ్యాటింగ్‌నూ లంక పర్వాలేదు. కుశాల్ మెండిస్ జట్టుకు వెన్నెముక. అసలంక, శానక, ధనంజయ, సమరవిక్రమ లాంటి ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నారు. శానక సహా జట్టులో ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉండటం లంకకు కలిసొచ్చే అంశం.
ఇదీ బలహీనత: బౌలింగ్ బాగున్నా బ్యాటింగ్‌లో తడబాటు లంకకు ప్రతికూలత. భారత్‌తో ఆసియాకప్ ఫైనలే ఇందుకు ఉదాహరణ. స్పిన్ బాగా ఆడుతున్నా.. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై తడబడడం బలహీనతగా మారింది. ముఖ్యంగా కుశాల్ మెండిస్‌కు మద్దతు కరవవుతోంది. ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పాక.. వెంటనే తడబడి కుప్పకూలడం లంకకు అలవాటుగా మారింది. శానక, ధనంజయ ఇటీవల బ్యాటింగ్‌లో సరైన ఫామ్‌లో లేరు. హసరంగ ఫిట్‌నెస్ కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుత జట్టులో ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు తక్కువగా ఉండడం కూడా మరో ప్రతికూలాంశం.
ఉత్తమ ప్రదర్శన: 1996లో విజేత
వీళ్లు కీలకం: హసరంగ, కుశాల్ మెండిస్, పతిరన, శానక.
జట్టు: శానక (కెప్టెన్), నిశాంక, దుమిత్ కరుణరత్నె, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), అసలంక, ధనంజయ, సమరవిక్రమ, తీక్షణ, హసరంగ, పతిరన, రజిత, చమీర, మదుశంక, లహిరు కుమార.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్‌గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగాడు. -
మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్‌కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. -
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్‌కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్‌కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.