World Cup - NZ vs AFG: గట్టి పోటీ ఇస్తున్న అఫ్గానిస్థాన్‌.. కివీస్‌ నాలుగు వికెట్లు డౌన్

ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌ తలపడుతున్నాయి. మొన్నటి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు గట్టి షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌.. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న న్యూజిలాండ్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

Updated : 18 Oct 2023 17:17 IST

చెన్నై: ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌ తలపడుతున్నాయి. మొన్నటి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు గట్టి షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌.. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న న్యూజిలాండ్‌కు గట్టి పోటీ ఇస్తోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ (54; 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా.. డేవాన్ కాన్వే (20), రచిన్‌ రవీంద్ర (32; 41 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ స్కోర్లు చేయలేకపోయారు. డారిల్ మిచెల్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్‌ (5*), టామ్ లాథమ్‌ (10*) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

డేవాన్ కాన్వేను ముజీబుర్‌ రెహ్మన్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. తర్వాత విల్‌ యంగ్, రచిన్ రవీంద్ర నిలకడగా ఆడటంతో 20 ఓవర్లకు 109/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచిన న్యూజిలాండ్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. పేసర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఒకే ఓవర్‌లో (21 ఓవర్‌) రెండు వికెట్లు పడగొట్టి కివీస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. రచిన్ రవీంద్రను క్లీన్‌బౌల్డ్ చేయగా, విల్‌ యంగ్‌.. వికెట్ కీపర్‌ ఇక్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రషీద్‌ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో డారిల్ మిచెల్‌ మిడ్‌ వికెట్‌లో ఇబ్రహీం జాద్రాన్‌కు చిక్కాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని