నవంబరు 22న పెర్త్‌లో..

ఆతిథ్య ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా మధ్య అయిదు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ నవంబరు 22న పెర్త్‌లో ఆరంభం కానుంది. రెండో టెస్టు డిసెంబరు 6 నుంచి జరుగుతుంది.

Published : 27 Mar 2024 01:48 IST

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ ఆరంభం

మెల్‌బోర్న్‌: ఆతిథ్య ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా మధ్య అయిదు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ నవంబరు 22న పెర్త్‌లో ఆరంభం కానుంది. రెండో టెస్టు డిసెంబరు 6 నుంచి జరుగుతుంది. ఈ డే/నైట్‌ గులాబి బంతి టెస్టుకు వేదిక అడిలైడ్‌. మూడో టెస్టు (డిసెంబరు 14-18)కు బ్రిస్బేన్‌, నాలుగో టెస్టు (డిసెంబరు 24-30)కు మెల్‌బోర్న్‌ ఆతిథ్యమిస్తాయి. చివరిదైన అయిదో టెస్టు జనవరి 27న సిడ్నీలో మొదలవుతుంది. తమ అంతర్జాతీయ షెడ్యూలులో భాగంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఈ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. 1992లో మొదలైన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లే జరిగాయి. ఈసారి నుంచి అయిదు టెస్టులు జరగనున్నాయి. రెండు జట్ల మధ్య జరిగిన గత నాలుగు సిరీస్‌ల్లో టీమ్‌ఇండియానే విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సార్లు (2018-19, 2020-21) భారత్‌ ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది. కానీ కమిన్స్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా.. నిరుడు లండన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని