జ్యోతి @ 2

ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది.

Published : 30 Apr 2024 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం ప్రపంచ ఆర్చరీ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్‌ సింగిల్స్‌లో జ్యోతి (299 పాయింట్లు) ఒక ర్యాంకు మెరుగై రెండో స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్‌ ఆర్చర్‌ ఇల్లా గిబ్సన్‌ (325) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విభాగంలో రెండో ర్యాంకు పొందిన భారత తొలి ఆర్చర్‌ జ్యోతినే. టీమ్‌ విభాగంలో భారత మహిళల జట్టు అగ్రస్థానంలో, మిక్స్‌డ్‌ జట్టు రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రపంచకప్‌లో కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత, టీమ్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో జ్యోతి పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని