బంగ్లాకు మరో విజయం

జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది.

Updated : 06 May 2024 04:44 IST

చట్టోగ్రామ్‌: జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. తస్కిన్‌ అహ్మద్‌ (2/18), రిషాద్‌ హొస్సేన్‌ (2/33)ల ధాటికి ఒక దశలో జింబాబ్వే 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే బ్రయాన్‌ బెనెట్‌ (44 నాటౌట్‌), జొనాథెన్‌ క్యాంప్‌బెల్‌ (45) పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించారు. అనంతరం జాంగ్వి (2/35) ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో బంగ్లా 62/3తో ఇబ్బందుల్లో పడ్డప్పటికీ.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తౌహిద్‌ హృదోయ్‌ (37; 25 బంతుల్లో 3×4, 2×6), మహ్మదుల్లా (26 నాటౌట్‌; 16 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని