పాండ్య కుటుంబం సాయం 200 కాన్సన్‌ట్రేటర్లు

కరోనా కష్ట కాలంలో తమ వంతు సాయం చేసేందుకు పాండ్య కుటుంబం ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల

Published : 02 May 2021 01:55 IST

దిల్లీ: కరోనా కష్ట కాలంలో తమ వంతు సాయం చేసేందుకు పాండ్య కుటుంబం ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వితరణ ఇవ్వనున్నట్లు హార్దిక్‌ పాండ్య శనివారం వెల్లడించాడు. ‘‘కరోనాపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, ఇతర వ్యక్తుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నా. నాతో పాటు కృనాల్‌, మా అమ్మ ఇలా మొత్తం మా కుటుంబం తరపున మాకు వీలైన విధంగా సాయం చేయాలనుకున్నాం. వైద్య సదుపాయాలు ఎక్కువగా అవసరం ఉండే భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల కోసం 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మనం కఠిన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సమయంలో మనకు తోచిన సాయం చేయడం ముఖ్యం. మీ అందరి కోసం మేం ప్రార్థిస్తూనే ఉంటాం’’ అని హార్దిక్‌ తెలిపాడు. ఇప్పటికే దిగ్గజం సచిన్‌తో సహా ధావన్‌, కమిన్స్‌, ఉనద్కత్‌, బ్రెట్‌లీ, పూరన్‌తో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్లు కూడా కరోనాపై పోరులో తమ వంతు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని