Dhoni: ధోనీ చూస్తుండగానే సెంచరీ చేశాడు.. ఆసక్తికర విషయం పంచుకున్న సాహా

మహేంద్రసింగ్‌ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా అన్నాడు. కెరీర్‌ ఆరంభ రోజుల్లో ఒక మ్యాచ్‌లో ధోనితో కలిసి ఆడిన మ్యాచ్‌లో అతను చూస్తుండగానే సెంచరీ చేయడాన్ని

Updated : 19 Apr 2022 07:10 IST

ముంబయి: మహేంద్రసింగ్‌ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా అన్నాడు. కెరీర్‌ ఆరంభ రోజుల్లో ఒక మ్యాచ్‌లో ధోనితో కలిసి ఆడిన సందర్భంగా అతను చూస్తుండగానే సెంచరీ చేయడాన్ని మరిచిపోలేనని సాహా గుర్తు చేసుకున్నాడు. ‘‘ధోనీతో కలిసి కోల్‌కతాలో ఒక క్లబ్‌ మ్యాచ్‌ ఆడాం. మేమిద్దరం ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాం. నేను 36 పరుగులు చేసేటప్పటికి ధోని స్కోరు 9 పరుగులు మాత్రమే. ‘సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ఇవ్వు’ అని మహి నాతో అన్నాడు. అంతే.. ఆ తర్వాతంతా ధోనీదే జోరు. నేను 41 పరుగులకు వచ్చేసరికి అతడి సెంచరీ పూర్తయిపోయింది. దీన్ని బట్టి అతడెంత వేగంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. మహి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నా. ఆట విషయానికి వచ్చేసరికి ఇద్దరం ఒకే ఉత్సాహంతో ఆడతాం’’ అని సాహా చెప్పాడు. గత సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన సాహాను ఈసారి మెగా వేలంలో రూ.1.9 కోట్లు వెచ్చించి గుజరాత్‌ టైటాన్స్‌ దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని