కామన్వెల్త్‌లో నాతో నేను పోటీపడతా

: కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించడం సులువని.. అక్కడ తనతో తానే పోటీపడతానని టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, భారత అగ్రశ్రేణి వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను తెలిపింది. జులై 30న ప్రారంభంకానున్న బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో చాను ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది.

Published : 27 Jun 2022 02:35 IST

పటియాలా: కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించడం సులువని.. అక్కడ తనతో తానే పోటీపడతానని టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, భారత అగ్రశ్రేణి వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను తెలిపింది. జులై 30న ప్రారంభంకానున్న బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో చాను ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. చాను వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 207 కేజీలు (88 కేజీలు+ 119 కేజీలు) కాగా.. ఆమె సమీప ప్రత్యర్థి స్టెల్లా కింగ్స్‌లే (నైజీరియా) ఇప్పటి వరకు 168 కిలోలు (72 కేజీలు+ 96 కేజీలు) బరువులు మాత్రమే ఎత్తగలిగింది. కాబట్టి కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌ లిఫ్టింగ్‌లో చానుకు స్వర్ణ పతకం లాంఛనమే. ‘‘కామన్వెల్త్‌ క్రీడలు నాకెంతో సులువు. అక్కడ నాతో నేను పోటీపడతా. కామన్వెల్త్‌లో ఎక్కువ పోటీ ఉండదు. అలాఅని పోరాటమే ఉండదని కాదు. భవిష్యత్తు టోర్నీలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. కామన్వెల్త్‌ క్రీడల్లోనూ ఒలింపిక్స్‌ రింగుల ఆకారంలోని చెవి పోగులు ధరిస్తా. టోక్యోలో అవి నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి’’ అని చాను తెలిపింది. కామన్వెల్త్‌ క్రీడల్లో చాను 2014లో రజతం, 2018లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని