క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు

ఈ సీజన్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ మరో సంచలన విజయం సాధించాడు. గురువారం మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అతడు 21-15, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌

Published : 01 Jul 2022 03:43 IST

కౌలాలంపూర్‌: ఈ సీజన్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ మరో సంచలన విజయం సాధించాడు. గురువారం మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అతడు 21-15, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ చోతిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ను కంగుతినిపించాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో పారుపల్లి కశ్యప్‌ 19-21, 10-21తో కున్లావత్‌ విదిత్‌శరన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు క్వార్టర్స్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ సింధు 19-21, 21-9, 21-14తో చాయ్‌వాన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. తొలి గేమ్‌లో పోరాడినా అనూహ్యంగా గేమ్‌ చేజార్చుకున్న సింధు.. ఆ తర్వాత తన శైలిలో చెలరేగి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ముందంజ వేసింది. క్వార్టర్స్‌లో ఆమె తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)ను ఎదుర్కొంటుంది. తైజుపై సింధు రికార్డు గొప్పగా ఏమీ లేదు. 20 మ్యాచ్‌ల్లో అయిదుసార్లు మాత్రమే గెలిచింది. పురుషుల డబుల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి వాకోవర్‌ ఇచ్చారు. ప్రిక్వార్టర్స్‌లో గోఫియ్‌-నుర్‌ ఇజుద్దీన్‌తో భారత జంట తలపడాల్సి ఉండగా.. సాత్విక్‌కు గాయం కావడంతో తప్పుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని