Serena Williams: ఆటకు సెరెనా వీడ్కోలు?

టెన్నిస్‌ నుంచి తాను రిటైర్‌కావాలని అనుకుంటున్నానని 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్‌ వ్యాఖ్యానించింది. ‘‘రిటైర్మెంట్‌ అన్న పదమే నాకు నచ్చదు.

Updated : 10 Aug 2022 03:11 IST

న్యూయార్క్‌: టెన్నిస్‌ నుంచి తాను రిటైర్‌కావాలని అనుకుంటున్నానని 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్‌ వ్యాఖ్యానించింది. ‘‘రిటైర్మెంట్‌ అన్న పదమే నాకు నచ్చదు. అది ఆధునిక పదంలా ఉండదు. వీడ్కోలు గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నా. జీవితంలో భిన్న దిశలో ప్రయాణించడానికి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. నా కౌంట్‌డౌన్‌ మొదలైంది’’ అని 40 ఏళ్ల సెరెనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. యుఎస్‌ ఓపెన్‌ తన చివరి టోర్నీ అని ఆమె సూచన ప్రాయంగా చెప్పింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని