అప్పుడు ఆసీస్‌ కూడా ఓడింది

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా ఇబ్బందిపడినా.. ఆ జట్టే విజేతగా నిలిచిందని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ అన్నాడు. టీమ్‌ఇండియా చేతిలో టీ20 సిరీస్‌ ఓటమి తమ శక్తిని తక్కువ చేయబోదని మిల్లర్‌ తెలిపాడు. ‘‘ప్రపంచకప్‌కు ముందు చాలా సిరీస్‌లలో ఆసీస్‌ రాణించలేదు.

Published : 04 Oct 2022 02:09 IST

గువాహటి: టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా ఇబ్బందిపడినా.. ఆ జట్టే విజేతగా నిలిచిందని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ అన్నాడు. టీమ్‌ఇండియా చేతిలో టీ20 సిరీస్‌ ఓటమి తమ శక్తిని తక్కువ చేయబోదని మిల్లర్‌ తెలిపాడు. ‘‘ప్రపంచకప్‌కు ముందు చాలా సిరీస్‌లలో ఆసీస్‌ రాణించలేదు. అయినా ప్రపంచకప్‌లో కంగారూ జట్టు విజేతగా నిలిచింది. కాబట్టి మేం ఆందోళన చెందట్లేదు. ఏడాదిన్నరగా మంచి జట్టును తయారు చేసుకున్నాం. ఆటగాళ్ల మధ్య చక్కని సమన్వయం ఉంది. నిరుడు చాలా సిరీస్‌లు గెలిచాం కూడా. భారత్‌ చేతిలో సిరీస్‌ ఓటమి బాధించేదే. కానీ గతంలో మేం గట్టి పోటీదారుగా నిలిచాం. ఇప్పుడు కనీసం తల ఎత్తుకుని నడవగలం. ఏదేమైనా సిరీస్‌ ఓటమి నిరాశ కలిగిస్తుంది. తొలి మ్యాచ్‌లో మేం సరిగా బ్యాటింగ్‌ చేయలేదు. రెండో పోరులో సరైన ఆరంభం లభించలేదు. అయినా మంచి భాగస్వామ్యంతో చివరి వరకు పోటీ ఇవ్వగలిగాం. పవర్‌ ప్లేను విశ్లేషించుకోడానికి విరామం పనికొచ్చింది. ఏం జరిగిందో.. ఎలా ఆడాలో చర్చించుకోడానికి సమయం లభించింది. సోమవారం చాలా పరిణామాలు జరిగాయి’’ అని మిల్లర్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని