క్రొయేషియా ఘనవిజయం.. కెనడా ఔట్‌

ఫిఫా ప్రపంచకప్‌లో వరుస సంచలనాల నేపథ్యంలో క్రొయేషియాపై కెనడా ఆధిక్యంలోకి వెళ్లడంతో మరో అనూహ్య ఫలితం తప్పదేమో అనిపించింది.

Published : 28 Nov 2022 01:50 IST

ఆల్‌ రయాన్‌: ఫిఫా ప్రపంచకప్‌లో వరుస సంచలనాల నేపథ్యంలో క్రొయేషియాపై కెనడా ఆధిక్యంలోకి వెళ్లడంతో మరో అనూహ్య ఫలితం తప్పదేమో అనిపించింది. కానీ షాక్‌ నుంచి తేరుకుని, గొప్పగా పుంజుకున్న క్రొయేషియా ఘనవిజయంతో నాకౌట్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. క్రమారిక్‌ ‘డబుల్‌’ సాధించడంతో ఆదివారం గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 4-1తో కెనడాపై ఘన విజయం సాధించింది. 2వ నిమిషంలో కెనడా ఆటగాడు డేవిస్‌ హెడర్‌ గోల్‌తో క్రొయేషియాకు షాక్‌ ఇచ్చాడు. కానీ క్రొయేషియా వెనక్కి తగ్గలేదు. ఎదురు దాడులకు దిగింది. క్రమారిక్‌ 36వ నిమిషంలో గోల్‌తో స్కోరు సమం చేశాడు. మార్కో (44వ ని) ఓ మెరుపు గోల్‌తో క్రొయేషియాకు ఆధిక్యాన్నందించాడు. 70వ నిమిషంలో క్రమారిక్‌ రెండో గోల్‌ సాధించడం, లోవ్రో 94వ నిమిషంలో బంతిని నెట్‌లోకి పంపడంతో క్రొయేషియా ఘనవిజయాన్ని అందుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కెనడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని