జపాన్‌కు కోస్టారికా దెబ్బ

ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో నాలుగు సార్లు విజేత జర్మనీకి షాకిచ్చిన జపాన్‌కు కళ్లెం పడింది.

Published : 28 Nov 2022 01:51 IST

అల్‌ రయాన్‌: ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో నాలుగు సార్లు విజేత జర్మనీకి షాకిచ్చిన జపాన్‌కు కళ్లెం పడింది. ఆదివారం గ్రూప్‌-ఈ పోరులో కోస్టారికా 1-0తో ఆ జట్టును దెబ్బకొట్టింది. కీషెర్‌ ఫుల్లర్‌ (81వ నిమిషంలో) గెలుపు గోల్‌ కొట్టాడు. గత మ్యాచ్‌లో స్పెయిన్‌ చేతిలో 0-7తో చిత్తయిన కోస్టారికా.. ఈ పోరులో మెరుగైన ప్రదర్శన చేసింది. మొదటి నుంచి దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థి గోల్‌పోస్టుపై ఎదురు దాడులు చేసింది. జపాన్‌ కూడా ప్రతిఘటించడంతో తొలి అర్ధభాగంలో గోల్సేమీ నమోదు కాలేదు. విరామం తర్వాత కూడా చాలా సమయం వరకూ ఏ జట్టూ ఖాతా తెరవలేకపోయింది. దీంతో టోర్నీలో మరో గోల్‌ లేని డ్రా తప్పదనిపించింది. కానీ ప్రత్యర్థి డిఫెన్స్‌ తప్పిదాన్ని సొమ్ము చేసుకున్న ఫుల్లర్‌ 18 మీటర్ల దూరం నుంచి బంతిని నెట్‌లోకి పంపించాడు. దీంతో కోస్టారికా సంతోషంలో మునిగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని