Sunil Gavaskar: ధోనీ కోసం సీఎస్కే టైటిల్ గెలవాలని నా హృదయం కోరుకుంటోంది: గావస్కర్
ఎంఎస్ ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టైటిల్ గెలవాలని తన హృదయం కోరుకుంటోందని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బెస్ట్ టీమ్ అని, అయితే ఎంఎస్ ధోనీ (MS Dhoni) కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టైటిల్ గెలవాలని తన హృదయం కోరుకుంటోందని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Gujarat Titans) అన్నాడు. ముంబయి ఇండియన్స్ (సొంత రాష్ట్రం) తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తన సెకండ్ ఫేవరెట్ టీమ్ అని పేర్కొన్నాడు.
‘‘ముంబయి ఇండియన్స్ (MI) తర్వాత నా సెకండ్ ఫేవరెట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కే గెలవాలని నా హృదయం కోరుకుంటోంది. ఎందుకంటే ఎంఎస్ ధోనీ మరోసారి గెలవగలడనే వాస్తవం అద్భుతంగా ఉంటుంది. అతడు ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకుంటూ కెప్టెన్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ జట్టు. వారికి శుభ్‌మన్ గిల్ రూపంలో అద్భుతమైన ఓపెనర్‌తోపాటు హార్దిక్ పాండ్య ఉన్నాడు’’ అని సునీల్ గావస్కర్ వివరించాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు బలమైన జట్లే కావడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్
-
‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్