IPL 2023: ఐపీఎల్‌ 2023.. లీగ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఫిక్స్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) కొత్త సీజన్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. రవవత్తరంగా సాగే మ్యాచుల కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మార్చి చివరి రోజు నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

Updated : 17 Feb 2023 20:12 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్‌ ఉన్న టీ20 లీగుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) ఒకటి. సంపదలోనూ టాప్‌గానే ఉంటుంది. అలాంటి ఐపీఎల్‌ పోటీల కోసం క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. వారి నిరీక్షణకు తెరతీస్తూ భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (BCCI) ఐపీఎల్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 31వ తేదీన గతేడాది ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) - చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings) జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2023 మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరగనుంది. హైదరాబాద్‌ వేదికగా ఏప్రిల్ 2వ తేదీన సన్‌రైజర్స్ - రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. లీగ్‌ల వరకు షెడ్యూల్‌ ప్రకటించిన నిర్వాహకులు.. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ వేదికలను ప్రకటించాల్సి ఉంది.

పది జట్లు పాల్గొనే ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఏడేసి మ్యాచ్‌లను సొంత మైదానం, వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది.  గ్రూప్‌ - Aలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఉన్నాయి.  గ్రూప్‌ - Bలో చెన్నై సూపర్‌ కింగ్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ ఉన్నాయి. మొత్తం మ్యాచుల కోసం 12 వేదికలను ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. అహ్మదాబాద్‌, మొహాలి, లఖ్‌నవూ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, జయ్‌పుర్, ముంబయి, గువాహటి, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు.. మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)

ముంబయి ఇండియన్స్‌ (MI)

సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ (SRH)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (LSG)

గుజరాత్‌ టైటాన్స్ (GT)

దిల్లీ క్యాపిటల్స్‌ (DC)

రాజస్థాన్‌ రాయల్స్ (RR)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని