Hardik Pandya: సీనియర్లు అలా నా పేరును చెప్పడం బాగుంది..

న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. కుటుంబంతో గడిపేందుకు హార్దిక్‌ పాండ్య భారత్‌కు వచ్చేస్తాడు. అయితే భారత టీ20 జట్టుకు హార్దిక్‌నే సారథిగా నియమించాలని రవిశాస్త్రి, సునిల్ గావస్కర్‌ వ్యాఖ్యానించారు. జట్టుకు సంబంధించి ఏవైనా నిర్ణ్రయాలను కొత్త సెలెక్షన్ కమిటీ మాత్రమే తీసుకోనుంది.

Published : 23 Nov 2022 18:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించిన తర్వాత అందరి నోటా ఒకటే మాట.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరుగా సారథ్య బాధ్యతలతోపాటు కోచింగ్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలి. భారత్‌ కూడా ఆయా ఫార్మాట్‌కు తగ్గట్టుగా రెగ్యులర్‌ సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో సీనియర్‌ ఆటగాళ్లకు కెప్టెన్సీ అప్పగిస్తూ వస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 1-0 తేడాతో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య వ్యవహరించాడు. ఈ క్రమంలో హార్దిక్‌నే టీ20 ఫార్మాట్‌కు రెగ్యులర్‌ సారథిగా నియమించాలని సునిల్ గావస్కర్, రవిశాస్త్రి వంటి మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. వీరి వ్యాఖ్యలపై హార్దిక్‌ స్పందించాడు. 

‘‘ అభిమానులు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. అయితే వారి మాటలు సంతోషం కలిగిస్తున్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రానంత వరకు నేను ఏదీ మాట్లాడలేను. సీనియర్లు అలా నా పేరును చెప్పడం బాగుంది. ఒక మ్యాచ్‌కైనా, సిరీస్‌కైనా కెప్టెన్‌గా వ్యవహరించడం ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. నా శైలిలో మ్యాచ్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. అలాగే జట్టును నడిపించడంలోనూ ప్రత్యేకతను కనబరుస్తా. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉంటా. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. దాని కోసం వేచి చూద్దాం’’ అని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని