WPL: ఔటే.. కానీ నాటౌట్.. ముంబయి, యూపీ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన
డబ్ల్యూపీఎల్ (WPL)లో భాగంగా యూపీ వారియర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)లో ముంబయి ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి... ఆదివారం యూపీ వారియర్స్‌ని ఓడించి నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబయి 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (53; 33 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరవగా.. నాట్ సీవర్ (45 నాటౌట్; 31 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్), ఓపెనర్ యాస్తిక భాటియా (42; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు.
ముంబయి ఇన్నింగ్స్ జరుగుతుండగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంజలి శ్రావణి వేసిన 11 ఓవర్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ ప్లిక్ చేయబోయింది. అయితే, బంతి బ్యాట్‌ను తాకకుండా వికెట్లను తాకి బెయిల్స్ వెలిగాయి. కానీ కింద పడలేదు. దీంతో హర్మన్ బతికిపోయింది. అప్పటికి హర్మన్ 14 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ