Rafael Nadal: రఫేల్‌ నాదల్‌కు ఎంత నగదు బహుమతి వచ్చిందంటే?

సుమారు రెండు వారాల పాటు సాగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ మెగా ఈవెంట్‌ ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌తో ముగిసింది. స్పానిష్‌ ఆటగాడు, ఆరో సీడ్‌ రఫేల్‌ నాదల్ రికార్డు స్థాయిలో...

Updated : 31 Jan 2022 13:20 IST

మెల్‌బోర్న్‌: సుమారు రెండు వారాల పాటు సాగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ మెగా ఈవెంట్‌ ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌తో ముగిసింది. స్పానిష్‌ ఆటగాడు, ఆరో సీడ్‌ రఫేల్‌ నాదల్ రికార్డు స్థాయిలో 21వ సారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకున్నాడు. దీంతో అతడు ఈ ఘనత సాధించి టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాడు. మరోవైపు ఫైనల్లో తొలి రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించిన రష్యా ఆటగాడు, రెండో సీడ్‌ మెద్వెదెవ్‌.. తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి చివరికి  2-6, 6-7 (5-7), 6-4, 6-4, 7-5 తేడాతో రన్నరప్‌గా నిలిచాడు. కాగా, వీరిద్దరికీ ఎంత మొత్తంలో నగదు బహుమతి లభించిందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. విజేతగా నిలిచిన నాదల్‌కు 2,875,000 ఆస్ట్రేలియా డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఇది భారత కరెన్సీలో రూ.15 కోట్లపైమాటే. అలాగే మెద్వెదెవ్‌కు 1,575,000 డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఇది రూ.8 కోట్లపైనే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని