Dhoni - IPL: పెయింటర్‌గానూ అదరగొట్టిన ధోనీ.. వీడియో వైరల్‌!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చెపాక్‌లో స్టేడియంలో కొన్ని కుర్చీలకు మెరుగుపెట్టాడు.

Published : 27 Mar 2023 18:02 IST

(photo: Chennai Super Kings Twitter)

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-16 (IPL 16) సీజన్‌ మార్చి 31 నుంచి ప్రారంభంకానుంది. దీంతో ఆటగాళ్లలందరూ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో చేరి సాధన మొదలెట్టేస్తున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్ (CSK)ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) నెల కిందటే సీఎస్కే శిబిరంలో చేరి సాధన చేస్తున్నాడు. ఐపీఎల్‌లో ధోనీ హోమ్‌ గ్రౌండ్ అయిన చెపాక్‌ స్టేడియం (Chepauk stadium)లో అతడి ఆటను చూసేందుకు సీఎస్కే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, మ్యాచ్‌లకు చెపాక్‌ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. 

పాడైన సీట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చడం, పాత వాటికి మెరుగుపెట్టడం చేస్తున్నారు. ఈ క్రమంలో మైదానంలో సాధన చేస్తున్న ధోనీ... కాసేపు ఆటకు విరామం ఇచ్చి పెయింటర్‌ అవతారమెత్తాడు. గ్యాస్‌ బ్లోయర్‌ సాయంతో స్టేడియంలోని కొన్ని కుర్చీలకు మెరుగుపెట్టాడు. మొదట పసుపు రంగు కుర్చీలకు తర్వాత నీలం రంగు కుర్చీలకు మెరుగులుదిద్దాడు. ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన ట్విటర్ ఖాతాలో పంచుకోగా.. అదీ వైరల్‌గా మారింది. మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఐపీఎల్-16 ఆరంభంకానుంది. ఈ సీజన్‌లో చెపాక్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఏప్రిల్ 3న చెన్నై, లఖ్‌నవూ జట్ల మధ్య జరగనుంది. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు