
Euro cup: ఫైనల్‌కు ఇటలీ
ఇంటర్నెట్‌డెస్క్: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన యూరో కప్ తొలి సెమీస్‌లో ఇటలీ గెలిచింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో 4-2 తేడాతో ఇటలీ జట్టు స్పెయిన్‌ను ఓడించింది. దీంతో ఇటలీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తంగా స్పెయిన్ జట్టే ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేపోయింది. 60వ నిమిషంలో ఫెడెరికో చియెసా గోల్ కొట్టి ఇటలీని ఆధిక్యంలో తీసుకెళ్లాడు. స్పెయిన్ ఆటగాడు అల్‌వరో మొరాటా 80వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. అయితే నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలో కూడా రెండు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఇక పెనాల్టీ సమరంలో చెరి ఆరు అవకాశాల్లో ఇటలీ నాలుగు చేయగా, స్పెయిన్ రెండు చేసింది. స్కోర్ 3-2తో ఉన్న సమయంలో ఇటలీ ఆటగాడు జోర్గిన్హో నిర్ణయాత్మక పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంతో ఇటలీ ఘన విజయం సాధించింది. రెండో సెమీస్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 12.30 గంటలకు ఇంగ్లాండ్, డెన్మార్క్ మధ్య జరగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.