Joe root: కోహ్లీ,స్మిత్‌లను దాటేసిన రూట్‌

భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జో రూట్‌..తాజాగా మరో రికార్డును అధిగమించాడు. భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌కు

Published : 07 Jul 2022 01:26 IST

(ఫొటో సోర్స్‌: ఇంగ్లాండ్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జో రూట్‌.. తాజాగా మరో రికార్డును అధిగమించాడు. భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లతో సమానంగా రూట్‌ 27 సెంచరీలు చేశాడు. అయితే బర్మింగ్‌హామ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టి తన కెరీర్‌లో 28వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రస్తుత ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో సెంచరీ చేశాడు. స్టీవ్‌ స్మిత్ 2021 జనవరిలో తన 27వ శతకం కొట్టాడు. దీంతో అప్పటివరకు వీరికి దగ్గర్లో కూడా లేని జోరూట్‌ ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 6 సెంచరీలు బాది వారిని అధిగమించి  ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌ అయ్యాడు. అంతేకాదు టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని సైతం అందుకున్నాడు. గత రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ పరుగులు వరద పారించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌ శతకంతో భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు(9) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రూట్‌ ఇదే జోరు కొనసాగిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌ రికార్డు బద్దలయ్యేటట్లు ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని